విస్తీర్ణం చిన్నదే కానీ.. హృదయం మాత్రం పెద్దది: లక్షద్వీప్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు

కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు.

Update: 2024-01-03 09:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘లక్షద్వీప్ విస్తీర్ణం చిన్నది కావచ్చు.. కానీ ఇక్కడి ప్రజల హృదయం మాత్రం చాలా పెద్దది’ అని కొనియాడారు. బుధవారం లక్ష ద్వీప్‌లో పర్యటించిన మోడీ..రూ. 1,150 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనేక శతాబ్దాలుగా దేశాన్ని పాలించిన పార్టీలు కేవలం తమ అభివృద్ధిని మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాయని విమర్శించారు. సరిహద్దు ప్రాంతాలను ఏనాడూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించిందని గుర్తు చేశారు. రాబోయే 1000 రోజుల్లో ఇక్కడి ప్రాంతానికి వేగవంతమైన ఇంటర్నెట్ లభిస్తుందని హామీ ఇచ్చారు. మోడీ ప్రారంభించిన ప్రాజెక్టుల్లో కవరత్తిలోని సౌర విద్యుత్ ప్లాంట్ ప్రధానమైంది. ఇది లక్ష్యద్వీప్‌లో మొదటి బ్యాటరీ ఆధారిత సౌర విద్యుత్ ప్రాజెక్టు కావడం గమనార్హం. 

Tags:    

Similar News