గుజరాత్ జైలు నుంచి విడుదలైన తీస్తా సెతెల్వాద్(Teesta Setalvad)
గాంధీనగర్: గుజరాత్ అల్లర్ల కేసులో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో అరెస్టైన సామాజిక కార్యకర్త తీస్తా సెతెల్వాద్ శనివారం విడుదలయ్యారు.
గాంధీనగర్: గుజరాత్ అల్లర్ల కేసులో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో అరెస్టైన సామాజిక కార్యకర్త తీస్తా సెతెల్వాద్ శనివారం విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆమెకు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా, మరుసటి రోజు గుజరాత్ సబర్మతీ జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. గుజరాత్ అల్లర్ల కేసులో తప్పుడు సాక్ష్యాలతో అమయాకుల అరెస్ట్‌కు కారణమయ్యారని ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెయిల్ మంజూరులో రాష్ట్రం దాటి బయటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పాస్‌పోర్టును ట్రయల్ కోర్టుకు అప్పగించాలని, విచారణకు సహకరించాలని పేర్కొంది.