Super 30 Anand : బేస్మెంట్లలో టీచింగ్‌పై బ్యాన్ విధించాలి.. ‘సూపర్ 30’ ఆనంద్ కుమార్ కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌ బేస్మెంట్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటనపై ‘సూపర్ 30’ ప్రోగ్రామ్ ఫౌండర్ ఆనంద్ కుమార్ స్పందించారు.

Update: 2024-08-01 18:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌ బేస్మెంట్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటనపై ‘సూపర్ 30’ ప్రోగ్రామ్ ఫౌండర్ ఆనంద్ కుమార్ స్పందించారు. బేస్మెంట్లలో తరగతుల బోధనను బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోచింగ్ సెంటర్లు, విద్యాసంస్థలను సంబంధిత విభాగాల అధికారులు తరుచుగా తనిఖీ చేయాలని.. ఎవరైనా బేస్మెంట్లలో పాఠాలు బోధిస్తున్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలని ఆనంద్ కోరారు.

‘‘కోచింగ్ సెంటర్లలో.. ఎంత మంది విద్యార్థులున్నారు ? వారి కోసం ఎంత స్థలం ఉంది ? ఎన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి ? అనే వివరాలను సంబంధిత విభాగాలు ఎప్పటికప్పుడు తనిఖీల్లో గుర్తించాలి. ఈవిషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలతో పాటు జరిమానాలను విధించాలి’’ అని ఆయన కోరారు. ఇటీవలే రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌ బేస్మెంట్‌లో చోటుచేసుకున్న దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు విద్యార్థులకు ఆ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పరిహారం చెల్లించాలని ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News