విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థిగా MK స్టాలిన్?
2024 ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీని ఢీ కొట్టేందుకు విపక్షాలు ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నాయి.
చెన్నయ్: 2024 ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీని ఢీ కొట్టేందుకు విపక్షాలు ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నాయి. సమయం దగ్గర పడుతోందని కాలయాపన చేయకుండా కార్యాచరణపై దృష్టి సారించాలని బిహార్ సీఎం నితీష్ కుమార్ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీని తొందరపెడుతున్న వేళ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్‌గా మారాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా స్టాలిన్ ఎందుకు ఉండకూడదు? ఇందులో తప్పేముంది అంటూ ఆయన కామెంట్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. స్టాలిన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా చెన్నయ్ వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తిగా మారాయి.
కాగా, ఇప్పటికే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సైతం రాబోయే ఎన్నికల పొత్తులపై క్లారిటీ ఇచ్చింది. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అని ఆ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీనే లీడ్ చేస్తుందని ఖర్గే వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేపాయి. ఇంతలో అనూహ్యంగా ప్రధాని రేస్‌లో స్టాలిన్ పేరును తీసుకురావడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే సౌత్ ఇండియా కార్డు అప్లై చేస్తే గనుక స్టాలిన్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మరోవైపు సీఎం కేసీఆర్ ప్రధాని పీఠమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టాలిన్ పేరుపై మిగతా విపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.