ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య కేసు ప్రధాన నిందితుడి ఎన్‌కౌంటర్

దిశ, నేషనల్ బ్యూరో : బీఎస్పీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-07-14 18:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బీఎస్పీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తిరువేంగడం‌ను శనివారం రాత్రి పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హత్య కోసం ఉపయోగించిన ఆయుధాలను దాచిన ప్రదేశాన్ని చూపించాలని అతడిని పోలీసులు కోరారు. దీంతో పోలీసులను తిరువేంగడం‌ ఓ ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ తనకు దొరికిన ఒక గన్‌తో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసులు జరిపిన ప్రతి కాల్పుల్లో తిరువేంగడం‌ ప్రాణాలు కోల్పోయాడు.

తిరువేంగడం‌పై మరో రెండు మర్డర్ కేసులు, ఒక దొంగతనం కేసు, ఐదు భౌతికదాడుల కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య కేసుకు సంబంధించి పోలీసుల అదుపులో ఇంకో 9 మంది నిందితులు ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి ఖండించారు. తిరువేంగడం‌ను కావాలనే పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారని ఆరోపించారు. సరైన భద్రతా చర్యలు లేకుండా అతడిని నిర్మానుష్య ప్రదేశానికి ఎందుకు తీసుకువెళ్లారని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News