Taliban Rule : మహిళలపై తాలిబన్ ప్రభుత్వం మరిన్ని క్రూరమైన ఆంక్షలు

Update: 2024-12-30 11:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వం మహిళల స్వేచ్ఛ హరించేలా మరిన్ని క్రూరమైన ఆంక్షలను విధించింది. అఫ్గాన్ మహిళలకు ఉద్యోగం ఇచ్చే ప్రభుత్వేతర జాతీయ, విదేశీ సంస్థలను మూసి వేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ‘ఎక్స్’ వేదికగా వివరాలను వెల్లడించారు. ‘ఎమిరాటీయేతర, జాతీయ, అంతర్జాతీయ ఎన్‌జీవోలకు అనుమతులు ఇచ్చే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆయా సంస్థల పర్యవేక్షణ బాధ్యతలను చూస్తోంది. మహిళలకు ఉద్యోగాలు ఇవ్వకూడదని మరోసారి సర్క్యూలర్ జారీ చేస్తున్నాం. నిబంధనలను అతిక్రమించే సంస్థలను మూసివేస్తాం. వాటి అనుమతులను సైతం రద్దు చేస్తాం.’ అని తెలిపారు. మహిళలు వంటగదిలో కనిపించినా.. బావుల వద్ద నుంచి నీళ్లు మోసిన అభ్యంతరకర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నివాస భవనాలను నిర్మించేటప్పుడు వంటగదికి కిటికీలు అమర్చవద్దని ప్రజలను హెచ్చరించారు.

Tags:    

Similar News