టీ20 వరల్డ్ కప్: భారత్-పాక్ తలపడేది అప్పుడే!

ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. జూన్ 4వ తేదీ నుంచి 30 వరకు ఈ టోర్నీ జరగనుంది.

Update: 2024-01-04 07:02 GMT
టీ20 వరల్డ్ కప్: భారత్-పాక్ తలపడేది అప్పుడే!
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. జూన్ 4వ తేదీ నుంచి 30 వరకు ఈ టోర్నీ జరగనుంది. దీనికి అమెరికా, వెస్టీండీస్‌ దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే మ్యాచ్‌ల షెడ్యూల్ దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటుండగా.. గ్రూపు దశలో భారత్ జూన్ 5న ఐర్లాండ్‌తో, 9న పాకిస్థాన్, 12న అమెరికా,15న కెనడాతో తలపడనున్నట్టు తెలుస్తోంది. బార్బడోస్‌లో ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. పూర్తి షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈనెల 8న రిలీజ్ చేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News