న్యూ ఇయర్‌ వేళ కండోమ్ ఆర్డర్ల మోత.. గంటకు ఎన్ని సేల్ అయ్యాయో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఇండియాలోనూ యువత ఉత్సాహంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.

Update: 2024-01-01 07:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఇండియాలోనూ యువత ఉత్సాహంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఎప్పటి లాగే న్యూఇయర్ సెలబ్రెషన్స్ ఎఫెక్ట్‌తో మద్యం విక్రయాలు జోరుగా సాగగా.. ఈసారి మద్యానికే కాకుండా ఇంకా చాలా వస్తువులు రికార్డు స్థాయిలో సేల్ అయ్యాయి. అందులో కండోమ్స్ ఆర్డర్లు రికార్డు మోత మోగించాయి. నిన్న గంటకు 1,722 కండోమ్స్ ఆర్డర్స్ వచ్చాయని ప్రముఖ డెలివరీ సంస్థ స్విగ్గీ సరదా ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 2023 ఏడాదిలో 9,940 కండోమ్‌లు ఆర్డర్ చేసినట్లు బ్లింకిట్ డెలివరీ సంస్థ ప్రకటించింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేశారు.

ఇన్ని కండోమ్స్ ఆర్డర్ చేశాడంటే ఇది కచ్చితంగా సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశారు. 2023లో బ్లింకిట్‌ను దేశ ప్రజలు ఆదరించారని.. ఆర్డర్లలో గణనీయమైన పెరుగుదల కనపరిచిందని సంస్థ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండా వెల్లడించారు. ఇక, ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో విజయవంతమైన నూతన సంవత్సర వేడుకను జరుపుకుందని, గత సంవత్సరాల్లో ఆర్డర్‌లలో అద్భుతమైన పెరుగుదలను నమోదు చేసిందని సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ ప్రకటించారు. 

Read More..

అలాంటి ఆలోచనలు వేధిస్తున్నాయా?.. త్వరగా చనిపోవచ్చు కూడా !  

Tags:    

Similar News