Swati Maliwal case:బిభవ్ కుమార్ పిటిషన్‌పై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు

బిభవ్ కుమార్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.

Update: 2024-08-01 18:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఆయనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. విచారణ సందర్భంగా.. 'ముఖ్యమంత్రి నివాసం ప్రైవేట్ బంగ్లానా? సీఎం నివాసంలో ఇలాంటి గూండాయిజం చేస్తారా? ఇది తెలిసి మేము షాక్ అయ్యాము. ఈ వ్యవహారం గాయాల తీవ్రత గురించి కాదు' అని బిభవ్ కుమార్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి బదులిచ్చిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. తనను ఎక్కడ కొట్టారనే దానిపై మలివాల్ చెప్పిన మాటల్లో వైరుధ్యాలు ఉన్నాయని, ఘటన జరిగిన రోజు ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండానే తిరిగి వచ్చిందని అన్నారు. జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును ఆగస్టు 7న విచారణను వాయిదా వేసింది.  

Tags:    

Similar News