నిలకడగా.. సీతారం ఏచూరి ఆరోగ్యం!
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి(Seetharam Yechuri) (72) ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆ పార్టీ 'X' లో ప్రకటన విడుదల చేసింది.
దిశ, వెబ్ డెస్క్: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి(Sitaram Yechury) (72) ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆ పార్టీ 'X' లో ప్రకటన విడుదల చేసింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్(Pneumonia) తో ఆగస్టు 19 వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్(AIIMS) లో చేరారు. ఆ రోజు నుంచి ఏచూరి హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్నారు. కాగా గురువారం ఆరోగ్యం కాస్త విషమంగా మారడంతో డాక్టర్లు ఆయనను వెంటిలేటర్ పై ఉంచారు. ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్(Intensive Care Unit )లో లంగ్ ఇన్ఫెక్షన్ కు చికిత్స జరుగుతుందని, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నికడగా ఉందని సీపీఎం పార్టీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా ఆగస్టు 31 న.. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి సీపీఎం పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఇప్పుడు ఏచూరి చికిత్సకు స్పందిస్తున్నారని పార్టీ నుంచి ప్రకటన రావడంతో.. సీతారాం అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కోలుకొని నిండు ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నారు.