ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కీలక తీర్పు.. ప్రధాని మోడీ రియాక్షన్ ఇదే!

ఆర్టికల్ 370 రద్దును సమర్దిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు చార్మిత్రాత్మకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.

Update: 2023-12-11 08:13 GMT
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కీలక తీర్పు.. ప్రధాని మోడీ రియాక్షన్ ఇదే!
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టికల్ 370 రద్దును సమర్దిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు చార్మిత్రాత్మకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. 2019 ఆగస్టు 5న పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధ నిర్ణయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన మోడీ.. జమ్మూ, కశ్మీర్, లడఖ్‌లోని ప్రజల కలలను సహకారం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రగతి ఫలాలను మీకు చేర్చడమే కాకుండా ఆర్టికల్ 370 కారణంగా నష్టపోయిన వర్గాలకు ప్రయోజనం అందజేయాలని నిశ్చయించుకున్నామన్నారు. ఇవాళ్టి సుప్రీంకోర్టు తీర్పు కేవలం చట్టపరమైన తీర్పు మాత్రమే కాదని ఇది అక్కడి ప్రజల భవిష్యత్ ఆశాకిరణం అన్నారు.

Tags:    

Similar News