బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 11 మంది దోషులకు విధించిన క్షమాభిక్షను రద్దు చేస్తూ సోమవారం తీర్పు చెప్పింది.

Update: 2024-01-08 05:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. దోషులకు క్షమాభిక్ష పెట్టే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని తెలిపింది. దీనిపై మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది. కాగా, 2002లో గుజరాత్ అల్లర్ల టైంలో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని నిందితులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జీవిత ఖైదు శిక్ష పడిన 11 మంది దోషులను 2022 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం రిలీజ్ చేసింది.

ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో బాధితులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం గతేడాది సుమారు 11 రోజుల పాటు విచారణ జరిపింది. అనంతరం అక్టోబర్ 12న తీర్పును రిజర్వ్ చేసి తాజాగా వెలువరించింది. ఈ మేరకు గుజరాత్ గవర్నమెంట్ నిర్ణయాన్ని రద్దు చేసింది. ఖైదీలందరూ జైలుకు తిరిగి రావాలని బెంచ్ ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉపశమనం పొందాలని తెలిపింది.

Tags:    

Similar News