తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు.. ఎవరు ?

దిశ, నేషనల్ బ్యూరో : వ్యక్తిగత అభ్యర్థనల మేరకు ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని కేంద్ర సర్కారుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

Update: 2024-02-14 17:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో : వ్యక్తిగత అభ్యర్థనల మేరకు ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని కేంద్ర సర్కారుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈమేరకు రెకమెండేషన్ చేసింది. ఇందులో కీలకమైన విషయం ఏమిటంటే.. బదిలీ కానున్న ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల్లో ఇద్దరు తెలంగాణకు రానున్నారు. కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌషుమి భట్టాచార్య, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్‌లను తెలంగాణ హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేయాలని కేంద్రానికి కొలీజియం సిఫారసు చేసింది. ఇక కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్‌ను కర్నాటక హైకోర్టుకు బదిలీ చేయాలని రెకమెండ్ చేసింది.

Tags:    

Similar News