హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రమాణం
హిమాచల్‌ప్రదేశ్ కొత్త సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : హిమాచల్‌ప్రదేశ్ కొత్త సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో ఆదివారం నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముకేశ్ అగ్నిహోత్రి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ హాజరయ్యారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12న ఎన్నికలు జరగగా డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 68 స్థానాలు ఉండగా... కాంగ్రెస్ పార్టీ 40 సీట్లను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు కసరత్తు చేసి సుఖ్విందర్ సుఖును ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి సన్నిహితుడిగా సుఖ్విందర్‌కు మంచి గుర్తింపు ఉంది.
Also Read.....
ఢిల్లీ బీజేపీ అధ్యక్ష పదవికి Adesh Gupta అదేష్ గుప్తా రాజీనామా