ఐఐటీ కాన్పూర్‌లో పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య: నెల రోజుల్లోనే మూడో ఘటన

కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిస్తున్నాయి.

Update: 2024-01-18 10:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిస్తున్నాయి. ఇటీవల ఇద్దరు విద్యార్థుల సూసైడ్ ఇష్యూస్ మరువక ముందే మరో పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన ప్రియాంక గతేడాది డిసెంబర్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో పరిశోధకురాలిగా జాయిన్ అయ్యి యూనివర్సిటీ హాస్టల్‌లో ఉంటుంది. ఈ క్రమంలో గురువారం తన తండ్రి నరేంద్ర జైస్వాల్ ప్రియాంకకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆయన హాస్టల్ మేనేజర్ రీతూ పాండేను సంప్రదించారు. ఆమె ప్రియాంక గది వద్దకు వెళ్లి చూడగా ఉరి వేసుకుని కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సూసైడ్‌కు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఒక నెల వ్యవధిలోనే ముగ్గురు స్టూడెంట్స్ ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. 

Tags:    

Similar News