ఒడిశాలో ప్రధాని మోదీ సైకత శిల్పాన్ని రూపొందించిన సుదర్శన్ పట్నాయక్

వరుసగా మూడోసారి మోదీ భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న తరుణంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రఖ్యాత సైకత రూప శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశా పూరీ తీరంలో ఇసుకలో ఆయన చిత్రాన్ని రూపొందించారు.

Update: 2024-06-09 03:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వరుసగా మూడోసారి మోదీ భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న తరుణంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రఖ్యాత సైకత రూప శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశా పూరీ తీరంలో ఇసుకలో ఆయన చిత్రాన్ని రూపొందించారు. ఆయన చిత్రంతో పాటు దానికి క్యాప్షన్‌గా ‘అభినందన్ మోదీ జీ 3.0’ , ‘విక్షిత్ భారత్’ అని రాశారు. ఇప్పుడు ఈ కళాకృతి బీచ్‌లో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్న పోస్టర్లు ఢిల్లీలో చాలా చోట్ల వెలిశాయి.

ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు మోదీ మరోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఆదివారం ఉదయాన్నే మోడీ రాజ్‌ఘట్‌లోని మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. అలాగే, సదైవ్ అటల్‌కు చేరుకున్న మోదీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించారు.

విదేశీ అతిధులు సైతం ఈ వేడుకకు వస్తున్నారు. రోడ్లపై ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడడానికి ఢిల్లీ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. 1,100 మంది ట్రాఫిక్ పోలీసులను మోహరించారు. ప్రతినిధుల కోసం రూట్ ఏర్పాటు చేశారు. దేశ రాజధాని మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రతలో ఉంది. కొన్ని రూట్లను క్లోజ్ చేశారు. రాష్ట్రపతి భవన్ సమీపంలోని రోడ్లపైకి ప్రవేశం నిషేధించారు. సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రజలకు రూట్ల మల్లింపు గురించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. రాష్ట్రపతి భవన్ చుట్టూ ఈరోజు మధ్యాహ్నం 2:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్నాట్లు అమల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు తమ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు..


Similar News