సుడాన్‌లో 31 మంది కర్ణాటక వాసులు..

సుడాన్‌లో మిలిటరీకి, పారామిలిటరీకి ఘర్షణల పరిస్థితులమధ్యలో కర్ణాటకకు చెందిన 31 మంది హక్కిపక్కీ తెగవారు ఆఫ్రికా దేశంలో చిక్కుకున్నారు.

Update: 2023-04-18 11:06 GMT

న్యూఢిల్లీ: సుడాన్‌లో మిలిటరీకి, పారామిలిటరీకి ఘర్షణల పరిస్థితులమధ్యలో కర్ణాటకకు చెందిన 31 మంది హక్కిపక్కీ తెగవారు ఆఫ్రికా దేశంలో చిక్కుకున్నారు. వారం రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య వారికి ఆహార కొరత ఏర్పడినట్లు కర్ణాటక విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు కేంద్రం దీనిపై చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. వారిని వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టట్లేదని విమర్శించింది. బొమ్మై బీజేపీ ప్రభుత్వం కన్నడ వ్యతిరేకి అని దుయ్యబట్టింది. వారిని విధికే వదిలేసింది.

వారిని దేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయట్లేదు’ అని కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ జోక్యం చేసుకుని వారిని సుడాన్ నుంచి తీసుకురావాలని మాజీ సీఎం సిద్ధరామయ్య కోరారు. అయితే ఈ విషయమై ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖకు సమాచారం ఇచ్చామని కర్ణాటక అధికారులు తెలిపారు. మరోవైపు భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని సుడాన్ లోని భారత ఎంబసీ ట్వీట్ చేసింది.

200కు చేరువైన మరణాలు..

సూడాన్‌లో హింస మూడో రోజుకు చేరింది. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 185 మంది మరణించగా, 1,800 మందికి పైగా గాయపడినట్లు ఐక్యరాజ్యసమితి ఎన్వాయ్ వాకర్ పెర్తెస్ తెలిపారు. దేశంపై పట్టు కోసం ఇరు వర్గాల మధ్య పోరు నెలకొంది. 2021 నుంచి మిలిటరీ ఆధీనంలోకి సూడాన్ వచ్చాక రాజకీయ సంక్షోభం నెలకొంది. అయితే పౌర ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించే ఒప్పందంపై సైన్యం, పారామిలటరీ దళాల మధ్య వివాదం నెలకొంది.

Tags:    

Similar News