కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టులో ఊరట

ముడా కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టులో ఊరట లభించింది.

Update: 2024-08-19 11:48 GMT

దిశ, వెబ్ డెస్క్ : ముడా కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విచారణ చేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ముడా స్కాంలో తనపై విచారణకు గవర్నర్ అనుమతినివ్వడాన్ని సిద్దరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. మైసూరులో జరిగిన ఓ భూకుంభకోణం వెనుక సీఎం సిద్దరామయ్య భార్య ఉండటం, ఈ కేసులో సిద్దరామయ్యను విచారించాలని విపక్షాలు గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్ కు ఫిర్యాదు చేయగా, సీఎంను విచారణకు అనుమతిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ అనుమతి చెల్లదంటూ, తనపై విచారణను ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిద్దరామయ్య. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సిద్దరామయ్యపై ఎలాంటి విచారణ చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27న తదుపరి విచారణ చేపట్టనున్నట్టు హైకోర్టు తెలిపింది. కాగా సిద్దరామయ్య తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.


Similar News