State Bank Of India:నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1497 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్

బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.

Update: 2024-09-14 20:25 GMT

దిశ, వెబ్‌డెస్క్:బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(SCO) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 14న ప్రారంభమై అక్టోబర్ 4, 2024న ముగుస్తుంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1497 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు:-

  • డిప్యూటీ మేనేజర్ (Systems)- ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ: 187 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (Systems)- ఇన్ఫ్రా సపోర్ట్& క్లౌడ్ ఆపరేషన్స్: 412 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (Systems)- నెట్వర్కింగ్ ఆపరేషన్స్: 80 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (Systems)- ఐటీ ఆర్కిటెక్ట్: 27 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (Systems)- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 7 పోస్టులు
  • అసిస్టెంట్ మేనేజర్ (Systems): 784 పోస్టులు

ఎంపిక విధానం:-

అభ్యర్థుల క్వాలిఫికేషన్స్,అనుభవం ఆధారంగా వారిని షార్ట్ లిస్ట్​ చేస్తారు. తర్వాత వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు:-

జనరల్​, ఈడబ్ల్యూఎస్,OBC కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.750 చెల్లించాలి. దివ్యాంగులు, ST, SC అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించక్కర్లేదు.డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.


Similar News