ప్రజ్వల్ బాధితులకు అండగా ఉండండి..కర్ణాటక సీఎంకు రాహుల్ లేఖ

ప్రజ్వల్ రేవణ్ణ కేసులోని బాధితులకు అండగా నిలవాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం లేఖ రాశారు. రేవణ్ణ చర్యలను తీవ్రంగా ఖండించిన రాహుల్.

Update: 2024-05-04 14:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజ్వల్ రేవణ్ణ కేసులోని బాధితులకు అండగా నిలవాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం లేఖ రాశారు. రేవణ్ణ చర్యలను తీవ్రంగా ఖండించిన రాహుల్..లైంగిక వేధింపులకు గురైన బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందించాలని తెలిపారు. ‘ప్రజ్వల్ కొన్నేళ్లుగా వందలాది మంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడి వీడియోలు తీశాడు. అతనిని అన్నదమ్ములుగా చూసుకున్న చాలా మందిని అత్యంత కిరాతకంగా హింసించారు. మా తల్లులు, సోదరీమణులపై అత్యాచారం చేసినందుకు కఠినమైన శిక్ష విధించాలి’ అని తెలిపారు. ‘బాధితులను అవసరమైన సహాయాన్ని అందించండి. ఇంతటి క్రూరమైన నేరాలు చేసిన నిందితులకు కఠినంగా శిక్షపడేలా చూడండి’ అని పేర్కొన్నారు.

‘ప్రస్తుత పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సిన నైతిక బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది. తీవ్ర ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని నేను అర్థం చేసుకున్నాను. ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేసి, అతడిని త్వరగా భారత్‌కు రప్పించాలని ప్రధానిని కూడా కోరుతున్నా’ అని వెల్లడించారు. ప్రజ్వల్ అరాచకాల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, మోడీ, అమిత్ షాల అండతోనే ప్రజ్వల్ తప్పించుకున్నారని ఆరోపించారు. 

Tags:    

Similar News