రాహుల్, అఖిలేష్ సభలో గందరగోళం.. తొక్కిసలాట..
ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రయాగ్ రాజ్‌లోని ఇండియా కూటమి ఎన్నికల ర్యాలీలో గందరగోళం జరిగింది. కాంగ్రెస్-సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీల ఎన్నికల ర్యాలీలో ఘర్షణ చెలరేగింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రయాగ్ రాజ్‌లోని ఇండియా కూటమి ఎన్నికల ర్యాలీలో గందరగోళం జరిగింది. కాంగ్రెస్-సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీల ఎన్నికల ర్యాలీలో ఘర్షణ చెలరేగింది. ఇరు పార్టీల కార్యకర్తల అత్యుత్సాహంతో తొక్కిసలాట జరిగింది. దీంతో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ సభాస్థలి నుంచి వెనుదిరిగిపోయారు. వారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించకుండానే వెళ్లిపోయారు.
ప్రయాగ్ రాజ్ జిల్లాలోని ఫుల్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని పదిలాలో ఈ రోజు జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడకుండా వెళ్లిపోయారు. కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు అదుపు తప్పి వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా గుంపులు గుంపులుగా కార్యకర్తలు స్టేజి పైకి దూసుకువచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. భద్రతాసిబ్బందికి గాయాలు అయ్యాయి. దీంతో రాహుల్, అఖిలేష్ అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
రాహుల్, అఖిలేష్.. పార్టీ కార్యకర్తలు శాంతించాలని పదేపదే కోరినప్పటికీ కార్యకర్తలు పట్టించుకోలేదు. ఇరువురు నేతలు తమలో తాం కొద్దిసేపు చర్చించుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కార్యకర్తలను అదుపుచేసేందుకు పోలీసులు, భద్రతాసిబ్బంది తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది.
#WATCH | Uttar Pradesh: Crowd goes uncontrollable in the joint public meeting of Congress MP Rahul Gandhi and Samajwadi Party chief Akhilesh Yadav, at Phulpur constituency in Prayagraj.
— ANI (@ANI) May 19, 2024
Rahul Gandhi and Akhilesh Yadav left the public meeting without addressing the crowd. pic.twitter.com/FDht29EmcX
కాంగ్రెస్-ఎస్పీ భాగస్వామ్యానికి మద్దతు ఇవ్వడానికి వేలాది మంది కార్యకర్తలు వచ్చారని అన్నారు రాహుల్ గాంధీ. పోలింగ్ బూత్‌ల వద్ద బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు వ్యతిరేకంగా నిలబడి.. ప్రయాగ్ రాజ్ అభ్యర్థి ఉజ్వల్ రమణసింగ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని రాహుల్ కోరారు.
#WATCH | Uttar Pradesh: A stampede-like situation took place in the joint public meeting of Congress MP Rahul Gandhi and Samajwadi Party chief Akhilesh Yadav at Phulpur constituency, in Prayagraj.
— ANI (@ANI) May 19, 2024
Rahul Gandhi and Akhilesh Yadav left the public meeting without addressing the… pic.twitter.com/fPW2tgaWOP