పూరీజగన్నాథ స్వామి ఆలయంలో తొక్కిసలాట (వీడియో)
ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 10 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 10 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఒడియా పంచాంగం ప్రకారం గత పౌర్ణమి నుంచి కార్తిక మాసం ప్రారంభమైంది. కార్తిక శుక్రవారం సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా 'మంగళ ఆలతి' నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు నెట్టుకుంటూ ఆలయంలోకి వెళ్లడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
Devotee blames #Odisha govt for the stampede-like situation that broke out at Puri Lord Jagannath Temple#Puri SP Kanwar Vishal Singh shares updates on the situation #Odisha pic.twitter.com/AMPuv4yZIQ
— OTV (@otvnews) November 10, 2023