Himachal Pradesh కొత్త CM గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు...
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు..Special News of Himchal Pradesh CM
దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. అయితే, ఆయన గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు. అవేమిటంటే...
1. సుఖు ఒక సామాన్య గ్రామీణ కుటుంబంలో జన్మించాడు. తన తండ్రి బస్సు డ్రైవర్ గా ఉన్న సమయంలో సుఖు చోటా సిమ్లాలో మిల్క్ కౌంటర్ నడిపాడు.
2. లా గ్రాడ్యుయేట్ అయిన్ సుఖు యొక్క రాజకీయ జీవితం హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. అక్కడ అతను కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ర్యాంకుల ద్వారా ఎదిగి ఆ తరువాత విద్యార్థి సంఘం అధ్యక్షుడు అయ్యాడు.
3. సుఖు దశాబ్ధం పాటు హిమాచల్ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ చీఫ్ గా పనిచేశాడు. ఆ తర్వాత 2013 నుంచి 2019 వరకు రికార్డు స్థాయిలో ఆరు సంవత్సరాలు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా పనిచేశాడు. మొట్టమొదటగా నదౌన్ నుంచి 2003లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 2007, 2017, 2022లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచాడు.
4. అదేవిధంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుఖు రెండుసార్లు సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ గా కూడా ఎన్నికయ్యాడు.
5. సుఖుకు రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధం ఉంది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్న మొదటి రాజకీయ నాయకుడు సుఖు.
Read More....