ఉల్లి కోసం స్పెషల్ ట్రైన్

ఉల్లి ధరలను నియంత్రించడానికే ప్రభుత్వ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి ఏకంగా స్పెషల్ ట్రైన్ నడిపింది.

Update: 2024-10-21 13:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉల్లి చాలా కాస్ట్లీ గురూ. దేశవ్యాప్తంగా ఉల్లి ధర భగ్గుమంటున్నది. ధరలను నియంత్రించడానికే ప్రభుత్వ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి ఏకంగా స్పెషల్ ట్రైన్ నడిపింది. తొలిసారిగా మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి కాందా ఎక్స్‌ప్రెస్ ఉల్లిని తీసుకెళ్లింది. త్వరలోనే ఇలాంటి ట్రైన్‌లు లక్నో, వారణాసి సహా అసోం, నాగాలాండ్, మణిపూర్ వంటి ఈశాన్య రాష్ట్రాలకు పంపిస్తామని కేంద్రం తెలిపింది.

ఉల్లి ధరను నియంత్రించడానికి ప్రభుత్వం 4.7 లక్షల టన్నుల రబీ పంట ఉల్లిని కొనుగోలు చేసింది. ధర పెరుగుతున్నా కొద్దీ కేంద్రం ఉల్లిని విడుదల చేస్తున్నది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కిలో రూ.35కు ఉల్లిని రిటేల్‌లో అందిస్తున్నది. ఢిల్లీలో ఉల్లి ధర కిలో రూ. 75కు పెరిగింది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో నాసిక్‌లోని లాసల్‌గావ్ రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీలోని కిషన్‌గంజ్ రైల్వే స్టేషన్‌కు కాందా ఎక్స్‌ప్రెస్‌లో ఉల్లిని తీసుకువచ్చింది. 56 ట్రక్కులకు సరిపడా ఉల్లిని ఈ ట్రైన్ ద్వారా ఢిల్లీకి ఉల్లిని తరలించింది. రోడ్డు ద్వారా తరలిస్తే రూ. 84 లక్షలు అయ్యేదని, ట్రైన్ ద్వరా రూ. 70.20 లక్షలు అయ్యాయని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖారే తెలిపారు. యూపీ, హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, జార్ఖండ్, తెలంగాణల్లోనూ సెప్టెంబర్ తొలి వారంతో పోల్చితే ఇటీవల ఉల్లి ధరలు తగ్గాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Tags:    

Similar News