Railway: రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఏంటంటే..?
రైలు అంటే మెడ్లిల్ క్లాస్ నేల విమానం అని ఓ గేయ రచయిత రైలును విమానంతో పోల్చారు.
దిశ వెబ్ డెస్క్: రైలు అంటే మెడ్లిల్ క్లాస్ నేల విమానం అని ఓ గేయ రచయిత రైలును విమానంతో పోల్చారు. అంటే మన దేశంలో రైలుకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్ధమవుతుంది. నేటీకీ దూర ప్రయాణాలు చేయాలనుకునేవారికి రైల్ బెస్ట్ ఆప్షన్. బస్సుతో పోల్చుకుంటే ధర తక్కువ, అలానే సౌకర్యవంతమైన ప్రయాణం. దీనితో ఎక్కువమంది రైల్లో ప్రయాణించేందుకే మక్కువ చూపుతారు.
అయితే పెరుగుతున్న రైలు ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల కోసం రైల్వే శాఖ అనేక పథకాలను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో తాజాగా దక్షణాది ప్రయాణికులకు దక్షణ రైల్వే శాఖ భారీ శుభవార్త చెప్పింది. ఇకపై రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు అతి తక్కువ ధరకే ఆహారాన్ని అందించేందుకు రెడీ అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో ఇండియన్ రైల్వే, ఐఆర్‌సీటీసీ సంయుక్తంగా ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్‌ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులకు పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ ఈ ఎకానమీ మీల్స్ విధానాన్ని తీసుకు వచ్చింది.
ఇప్పటికే ఈ ఎకానమీ మీల్స్ పథకం కింద 150 కేంద్రాల ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ పథకాన్ని దక్షణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట , గుంతకల్ , తిరుపతి , రాజమండ్రి, వికారాబాద్, పాకాల, డోన్, నంద్యాల రైల్వే స్టేషన్‌లలో 18 కౌంటర్ల ద్వారా ఈ ఎకానమీ మీల్స్‌ను ప్రయాణికులకు అందించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.
ఇక ఈ ఎకానమీ మీల్స్‌లో రెండు రకాలైన భోజనాన్ని అందిస్తున్నారు. మొదటి రకంలో 20 రూపాయలకే ప్రయాణికులకు ఎకానమీ భోజనం అందించనున్నారు. ఇక రెండోరకంలో 50 రూపాయలకు స్నాక్ మీల్స్ అందిస్తారు. అలానే రూ 3కే 200ML నీటి ప్యాకెట్లను అందించనున్నారు.