రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ అధినేత్రి Sonia Gandhi
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంగళవారం రాష్ట్రపతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంగళవారం రాష్ట్రపతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ముర్మును సోనియా కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యనే కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చైర్మెన్‌గా ఆనంద్ శర్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు పార్టీ కీలక నేత గులాం నబీ అజాద్ గుడ్ బై చెప్పారు. రాష్ట్రపతిగా గెలిచిన ముర్మును సోనియా కలవడం ఇదే తొలిసారి. అంతకుముందు ట్విట్టర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలియజేశారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చింది.