రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికకు సోనియాగాంధీ నామినేషన్

సోనియాగాంధీ రాజ్యసభ ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నిక కోసం సోనియా పోటీ చేయనున్నారు.

Update: 2024-02-14 07:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సోనియాగాంధీ రాజ్యసభ ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నిక కోసం సోనియా పోటీ చేయనున్నారు. తెల్లవారుజామున సోనియా తన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి జైపూర్ విమానాశ్రయంలో దిగారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లోత్ వారికి స్వాగతం పలికారు. అక్కడ్నుంచి రాజస్థాన్ అసెంబ్లీకి వెళ్లారు. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీని నామినేట్ చేస్తూ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులన జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.

బిహార్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వి, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హందోరే రాజ్యసభ స్థానాలకు నామినేషన్ వేశారు.

రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ ఒక రాజ్యసభ సీటుని గెలుచుకోవడం ఖాయం. దీంతో అక్కడ్నుంచే సోనియా పోటీ చేయనున్నారు. ఐదుసార్లు లోక్ సభ ఎంపీగా ఉన్న సోనియా.. తొలిసారి రాజ్యసభకు వెళ్లనున్నారు. రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.

15 రాష్ట్రాలకు చెందిన మొత్తం 56 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఆస్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు నామినేషన్ వేసేందుకు ఈనెల 15 చివరితేదీ.


Similar News