Sonia Gandhi: ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు సోనియాగాంధీ..?

సోనియాగాంధీ కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ కావాలని యోచిస్తున్నారని కథనాలు వస్తున్నాయి.

Update: 2023-07-23 13:00 GMT

న్యూఢిల్లీ : సోనియాగాంధీ కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ కావాలని యోచిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. ఆరోగ్య కారణాల రీత్యా 2024 లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ పోటీ చేసే అవకాశం లేనందున.. తమ రాష్ట్రం (కర్ణాటక) నుంచి రాజ్యసభ సభ్యురాలు కావాలని సీఎం సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సోనియాకు సూచన చేసినట్లు తెలుస్తోంది. 2024 ఏప్రిల్ 2న కర్ణాటకకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు సయ్యద్ నసీర్ హుస్సేన్, డాక్టర్ ఎల్. హనుమంతయ్య, జీసీ చంద్రశేఖర్ ల పదవీకాలం ముగియనుంది. కర్ణాటకలో కాంగ్రెస్‌కు అత్యధికంగా 135 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నందున.. ఆ 3 రాజ్యసభ స్థానాలను సునాయాసంగా మళ్ళీ నిలుపుకోగలదు. ఇక కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.


Similar News