ప్రధాని మోడీ కొత్త కేబినెట్‌లో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు

ఎన్‌డీఏ మిత్రపక్షాల నుంచి బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మంత్రివర్గంలో చేరారు.

Update: 2024-06-09 15:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. 71 మంది మంత్రులతో కూడిన మండలిలోని మోడీ కొత్త మంత్రివర్గంలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉండటం గమనార్హం. 30 మంత్రులతో కూడిన ఆయన కేబినెట్‌లో మూడుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్, అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఉన్నారు. ఎన్‌డీఏ మిత్రపక్షాల నుంచి బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కూడా మోడీ మంత్రివర్గంలో చేరారు. వీరిద్దరూ ఆయా రాష్ట్రాలకు స్వల్పకాలమే ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. ప్రధాని కాకముందు నరేంద్ర మోడీ కూడా మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. 31 మంది కేబినెట్ మంత్రులతో పాటు ప్రధాని మోడీ కొత్త బృందంలో స్వతంత్ర బాధ్యతలు కలిగిన ఐదుగురు సహాయ మంత్రులు, 35 మంది జూనియర్ మంత్రులు ఉన్నారు. కౌన్సిల్‌లో ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన 11 మంది మంత్రులు ఉన్నారు.  

Tags:    

Similar News

టమాటా @ 100