చాందీపురా వైరస్‌కు ఆరుగురు చిన్నారులు బలి
దిశ, నేషనల్ బ్యూరో : కేరళ రాష్ట్రం ఇప్పటికే కొత్త వైరస్‌లతో వణికిపోతోంది.
దిశ, నేషనల్ బ్యూరో : కేరళ రాష్ట్రం ఇప్పటికే కొత్త వైరస్‌లతో వణికిపోతోంది. ఈ తరుణంలో గుజరాత్‌లోని సబర్‌కాంత, ఆరావళి జిల్లాల్లోని చిన్నారులకు ‘చండీపురా’ వైరస్ సోకుతోంది. ఈ వైరస్ కారణంగా గత కొన్ని రోజుల వ్యవధిలో 12 మంది పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకగా.. వారిలో ఆరుగురు మరణించారని గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి రుషికేశ్ పటేల్ వెల్లడించారు. చండీపురా వైరస్ మొదట జ్వరానికి కారణమవుతుంది. ఇది సోకిన వారిలో ఫ్లూ వంటి లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ దోమలు, ఈగలు, కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి బారినపడిన పిల్లల మెదడు వాచిపోతుంది. ఈ వైరస్ వల్ల తొలిసారిగా 1966లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న చాందీపూర్ గ్రామంలో పలువురు 15 ఏళ్లలోపు పిల్లలు చనిపోయారు. అందుకే ఆ వైరస్‌ను కూడా చండీపురా వైరస్ అని పిలుస్తున్నారు.