సిక్కులు తప్పనిసరిగా ఐదుగురు పిల్లల్ని కనాలి: బాబా హర్నామ్ సింగ్ ఖల్సా
దామ్‌దామి తక్సల్ ఖల్సా సిక్కు సంస్థ చీఫ్ బాబా హర్నామ్ సింగ్ ఖల్సా కీలక వ్యాఖ్యలు చేశారు. సిక్కులు బలమైన కుటుంబ బంధాలను కలిగి ఉండటానికి తప్పనిసరిగా ఐదుగురు పిల్నల్ని కనాలని సూచించారు.
దిశ, నేషనల్ బ్యూరో: దామ్‌దామి తక్సల్ ఖల్సా సిక్కు సంస్థ చీఫ్ బాబా హర్నామ్ సింగ్ ఖల్సా కీలక వ్యాఖ్యలు చేశారు. సిక్కులు బలమైన కుటుంబ బంధాలను కలిగి ఉండటానికి తప్పనిసరిగా ఐదుగురు పిల్నల్ని కనాలని సూచించారు. మరింత పెద్ద కుటుంబాలకు మద్దతునిస్తూ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి పిల్లలను పెంచడంలో దామ్‌దామి తక్సల్ సహాయపడుతుందని తెలిపారు. వారికి తగిన ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. సిక్కు దంపతులు పంజాబ్‌ను మతపరంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా బలోపేతం చేయడానికి కనీసం ఐదుగురు పిల్లలను కలిగి ఉండటమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. సిక్కులు మాత్రమే కాదు, పంజాబ్‌లో నివసిస్తున్న హిందువులు, ఇతర వర్గాల ప్రజలు కూడా ఐదుగురు పిల్లలను కనాలని చెప్పారు. ఈ పరిణామంతో సమాజ శ్రేయస్సుకు సైతం దోహద పడొచ్చని వెల్లడించారు. కాగా, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తాజా నివేదిక ప్రకారం..950 నుండి 2015 వరకు, హిందూ జనాభా 7.8 శాతం క్షీణించగా, ముస్లిం జనాభా 43 శాతం పెరిగింది. అలాగే సిక్కు జనాభా వాటా 1950లో 1.24 శాతం నుంచి 2015 నాటికి 1.58 శాతం పెరిగింది.