శ్రద్దా హత్య కేసు వల్లే బలవంతంగా బ్రేకప్.. తునీషాశర్మ బాయ్‌ఫ్రెండ్
తునీషా శర్మ కేసులో అరెస్టైన బాయ్ ఫ్రెండ్ షీజన్ ఖాన్ కీలక విషయాన్ని వెల్లడించారు.
ముంబై: తునీషా శర్మ కేసులో అరెస్టైన బాయ్ ఫ్రెండ్ షీజన్ ఖాన్ కీలక విషయాన్ని వెల్లడించారు. దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసుకు భయపడే బ్రేకప్ చెప్పినట్టు తెలిపారు. వేరే కమ్యూనిటీకి చెందిన యువతి కావడం కూడా కారణమని పేర్కొన్నారు. శ్రద్ధా ఘటనతో దేశంలో నెలకొన్న పరిస్థితితో ఆందోళన చెంది, తునిషాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా బ్రేకప్ అయినట్టు వెల్లడించారు. అయితే వయస్సు బేధం కూడా కారణమని అన్నారు.
రెండు రోజుల క్రితం టీవీ నటి తునీషా శర్మ షూటింగ్ స్పాట్‌లోని ఓ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సహచర నటుడు షీజన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యకు ముందు షీజన్‌తో కలిసి తునీషా మధ్నాహ్నం లంచ్ చేసింది. మరోవైపు షీజన్ ఖాన్ మోసం చేయడం వల్లే తునీషా మరణించిందని ఆమె తల్లి ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని అన్నారు. వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని కూడా తునీషాను ప్రేమించడాని ఆరోపించారు. షీజన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి : మహిళా ఎస్ఐ రాసలీలలు.. కానిస్టేబులైన భర్త కంట పడటంతో..