సీఎంకు బెందిరింపు కాల్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్ ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో పినరయి విజయన్‌ను హత్య చేయబోతున్నామంటూ కేరళ పోలీస్ కంట్రోల్ రూమ్ అగంతకుడి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది.
దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్ ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో పినరయి విజయన్‌ను హత్య చేయబోతున్నామంటూ కేరళ పోలీస్ కంట్రోల్ రూమ్ అగంతకుడి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారనే దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా షాకింగ్ విషయం వెలుగు చూసింది. ఈ బెదింపు కాల్ చేసింది ఎర్నాకులంకు చెందిన 7వ తరగతి విద్యార్థి అని గుర్తించారు. దీంతో ఆ బాలుడి పనికి అంతా షాక్ తిన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీఎంకు బెదిరింపు విషయంలో తెరవెనుక ఎవరైనా ఉన్నారా లేక ఏడో తరగతి అబ్బాయే ఈ పని చేశాడా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.