ఒడిషా రైలు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు.. కరెంట్ షాక్‌తో 40 మంది మృతి

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశంలోని ప్రతి ఒక్కరిని కలచి వేసిన సంగతి తెలిసిందే.

Update: 2023-06-06 09:14 GMT
ఒడిషా రైలు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు.. కరెంట్ షాక్‌తో 40 మంది మృతి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశంలోని ప్రతి ఒక్కరిని కలచి వేసిన సంగతి తెలిసిందే. ఒకే ప్రదేశంలో మూడు రైళ్లు ప్రమాదానికి గురై.. 275 మంది మంది మృతి చెందడం, 500 మందికి పైగా గాయాలవ్వడం ఎంతో బాధాకరమైన ఘటన. అయితే ఆ ప్రమాదంలో మరణించిన 40 మంది మృతదేహాలకు ఎలాంటి గాయాలు లేవని ఓ పోలీసు ఆఫీసర్ తెలిపాడు. తొలగించిన మృతదేహాల్లో నలభై మంది శరీరాలపై కనీసం ఎలాంటి చిన్న గాయాలు కూడా కనిపించలేదని, వాళ్లు కరెంట్ షాక్ వల్లే చనిపోయినట్లున్నారని వెల్లడించారు. కాగా ఓవర్ హెడ్ కేబుల్ రైలుపై పడిందని, దీంతో వారు విద్యుదాఘాతానికి గురై మరణించి ఉంటారని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News