త్రివిద దళాల ఉమ్మడి ప్రదర్శన.. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇదే తొలి సారి

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి 'బలమైన, సురక్షితమైన భారత్' థీమ్‌తో ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా జాతీయ భద్రత, కార్యచరణ విశిష్టతను ప్రజల ముందు ఉంచే అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది.

Update: 2025-01-22 18:12 GMT
త్రివిద దళాల ఉమ్మడి ప్రదర్శన.. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇదే తొలి సారి
  • whatsapp icon

- బలమైన, సురక్షితమైన భారత్ థీమ్‌తో పరేడ్

- ప్రకటించిన రక్షణ మంత్రిత్వ శాఖ

దిశ, నేషనల్ బ్యూరో:

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్యపథ్‌లో ఈ సారి నిర్వహించే పరేడ్‌లో త్రివిధ దళాలు తొలి సారిగా సంయుక్త ప్రదర్శన చేయబోతున్నాయి. దేశ ప్రజలకు త్రివిధ దళాల ఐక్యత, ఏకీకరణ స్పూర్తిని తెలియజేయడానికే ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి 'బలమైన, సురక్షితమైన భారత్' థీమ్‌తో ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా జాతీయ భద్రత, కార్యచరణ విశిష్టతను ప్రజల ముందు ఉంచే అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. మూడు సేనల మధ్య నెట్‌వర్కింగ్, కమ్యునికేషన్స్‌ను సులభతరం చేసే ఆపరేషన్లను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. నింగి, నేల, నీటిపై చేసే యుద్దం తాలూకు దృశ్యాలను ఈ పరేడ్‌లో ప్రజలకు చూపించనున్నారు. స్వదేశీ తయారీ ప్రధాన యుద్ద ట్యాంక్ అర్జున్, తేజస్ ఎంకే 2 విమానం, అదునాతన తేలికపాటి హెలీకాఫ్టర్లు, డిస్ట్రాయర్ ఫ్రిగేట్‌లను ప్రదర్శించనున్నారు. ఈ పరేడ్‌లో త్రివిద దళాల సమన్వయాన్ని తెలియజేయడానికే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే 2025ను రక్షణ మంత్రిత్వ శాఖలో సంస్కరణల ఏడాదిగా పాటిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News