కుప్పకూలిన శివాజీ భారీ విగ్రహం

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ లో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కుప్పకూలిపోయింది.

Update: 2024-08-26 11:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని సింధుదుర్గ్ లో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కుప్పకూలిపోయింది. మాల్వాన్ లోని రాజ్ కోట్ వద్ద గల 35 అడుగుల మరాఠా వీరుడు, ఛత్రపతి శివాజీ విగ్రహం సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అకస్మాత్తుగా కూలిపోయింది. అయితే గతేడాది విగ్రహావిష్కరణ జరగగా.. ఇప్పుడే కూలిపోవడం వెనుక ఏవైనా కుట్రలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు, ఉన్నత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మాల్వాన్ లో కురుస్తున్న భారీ వర్షాలకు అది కూలిపోయి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 35 అడుగుల ఈ శివాజీ మహరాజ్ భారీ విగ్రహాన్ని గత డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించగా.. అది ఏడాది తిరగక ముందే కూలిపోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 


Similar News