Punjab: బైక్ పై వెంబడించి.. తుపాకీతో కాల్చి.. శివసేన నేత దారుణ హత్య

పంజాబ్ లో శివసేన నేత దారుణ హత్యకు గురయ్యారు. ఆయన బైక్ పై పారిపోతుండగా వెంబడించారు. దగ్గర్నుంచి కాల్పులు జరిపి చంపేశారు.

Update: 2025-03-14 12:52 GMT
Punjab: బైక్ పై వెంబడించి.. తుపాకీతో కాల్చి.. శివసేన నేత దారుణ హత్య
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ లో శివసేన నేత దారుణ హత్యకు గురయ్యారు. ఆయన బైక్ పై పారిపోతుండగా వెంబడించారు. దగ్గర్నుంచి కాల్పులు జరిపి చంపేశారు. ఈ ఘటన పంజాబ్ లోని మోగా జిల్లాలో జరిగింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో మోగా జిల్లా శివసేన అధ్యక్షుడు మంగత్ రాయ్ మంగ షాపు దగ్గర పాలు కొంటున్నారు. ఆలోగా గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు బైక్ పై అక్కడికి వచ్చారు. ఆయన పారిపోతుండగా.. కాల్పులు జరిపారు. కాగా.. ఆయన పక్కన ఉన్న 12 ఏళ్ల బాలుడికి బుల్లెట్‌ తగలడంతో అతడు గాయపడ్డాడు. దీంతో, అప్రమత్తమైన మంగత్‌ రాయ్‌ వెంటనే బైక్‌పై అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే దుండగులు ఆయనను వెంబడించారు. మరోసారి కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. రక్తం మడుగుల్లో రోడ్డుపై పడిన మంగత్‌ రాయ్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

కేసు నమోదు

మరోవైపు, ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్పాట్ కి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిపైన కేసు నమోదు చేశారు. గాయపడిన బాలుడికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించి.. మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించారు. శివసేన నేత మంగత్ రాయ్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఏ వర్గానికి చెందిన నేత అన్నది ఆరా తీస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు. మరోవైపు, శివసేన నేతలు రోడ్డుపై బైఠాయించి మంగత్‌ రాయ్‌ హత్యపై నిరసన తెలిపారు.

READ MORE ....

Tamil Nadu assembly: తమిళనాడు అసెంబ్లీ నుంచి బీజేపీ, ఏఐడీఎంకే వాకౌట్


Tags:    

Similar News