Shashi tharoor: వయనాడ్ ఘటనను తీవ్ర ప్రకృతి విపత్తుగా ప్రకటించాలి.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్

కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనకు తీవ్ర ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు గురువారం లేఖ రాశారు.

Update: 2024-08-01 09:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనకు తీవ్ర ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు గురువారం లేఖ రాశారు. ప్రకృతి విపత్తుగా ప్రకటించడం వల్ల ప్రభావిత ప్రాంతానికి ఎంపీల నిధుల నుంచి రూ.కోటి వరకు అందించేందుకు అనుమతి వస్తుందని తెలిపారు. అకస్మాత్తుగా సంభవించిన ఈ విపత్తు ఎంతో విషాదాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. ‘కొండచరియలు విరిగిపడి అనేక మంది జీవితాల్లో బాధను నింపాయి. కాబట్టి వయనాడ్ ప్రజలకు సాధ్యమైనంత సహాయాన్ని అందించడం చాలా ముఖ్యమైనది. ఈ విపత్తు ఎంత పెద్దదైతే దానికి సమాజంలోని అన్ని వర్గాల నుంచి సమన్వయంతో కూడిన ప్రతిస్పందన ఉంటుంది’ అని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సహాయాన్ని అందించడానికి మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. ప్రభుత్వం నా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News