హమాస్ కోసం పోరాడేందుకు శరద్ పవార్ తన కూతురిని పంపాలి: అస్సాం సీఎం హిమంత
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో భారత వైకరిపై శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై దేశంలోని రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో భారత వైకరిపై శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై దేశంలోని రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో అస్సాం సీఎం హిమంత శర్మ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ గురించి శర్మ మాట్లాడుతూ.. "హమాస్ కోసం పోరాడేందుకు శరద్ పవార్ సుప్రియ (సులే)ని గాజాకు పంపుతారని నేను భావిస్తున్నాను" అని పేర్కొన్నారు. పవార్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత పీయూష్ గోయల్ ట్విటర్‌లో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదాన్ని ఖండించవలసింది పోయి వారికి మద్దతు తెలుపుతారా అంటూ ఫైర్ అయ్యారు. కాగా శరద్ పవార్ ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం పై స్పందిస్తూ.. భారతదేశం ఎల్లప్పుడూ పాలస్తీనా వాదానికి మద్దతిస్తూనే ఉందని పవార్ తన స్థానాన్ని సమర్థించిన తర్వాత వివాదం చెలరేగింది. భారత మాజీ ప్రధానులు కూడా పాలస్తీనాతో దృఢంగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర బీజేపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి.