ఎంపీ కూతురుకు తప్పని లైంగిక బెదిరింపులు

సామాన్య మహిళలే కాదు ఏకంగా ఎంపీ కూతురుకు కూడ లైంగిక బెదిరింపులు తప్పడం లేదు.

Update: 2024-08-26 10:09 GMT

దిశ, వెబ్ డెస్క్ : సామాన్య మహిళలే కాదు ఏకంగా ఎంపీ కూతురుకు కూడ లైంగిక బెదిరింపులు తప్పడం లేదు. పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూతురును ఉద్దేశిస్తూ ఓ ఆగంతుకుడు లైంగిక వేధింపులకు దిగాడు. ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుల మీద పక్షపాత ధోరణిలో వ్యవహరించారని తృణమూల్ నాయకుల మీద సామాజిక మధ్యమాల్లో తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ అభిషేక్ కూతురును ఉద్దేశించి ఓ నిరసనకారుడు.. "నీ కూతురును రేప్ చేస్తాం.. అలా చేసిన చేసిన వారికి భారీ నగదు బహుమతిగా ఇస్తాం.." అని చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటనపై పలు ఎన్జీవోస్, విద్యార్థి సంఘాలు గొంతెత్తాయి. ఒక మంత్రి కూతురునే ఇలా బహిరంగంగా బెదిరిస్తే మామూలు మహిళలు, విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించాయి. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న బాలల హక్కుల కమిషన్ కేసును సుమోటోగా స్వీకరించింది. వెంటనే కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ట్రైనీ డాక్టర్ నిరసనాల్లో పాల్గొన్న వ్యక్తిగా ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.  


Similar News