Trump: హుష్ మనీ కేసులో ట్రంప్ కు షాక్..!
అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కు షాక్ తగిలింది. పోర్న్ స్టార్‌కు హుష్ మనీ (Hush Money Case) కేసులో ఎదురుదెబ్బ తగిలింది.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కు షాక్ తగిలింది. పోర్న్ స్టార్‌కు హుష్ మనీ (Hush Money Case) కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు నిరాకరరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని మన్‌హట్టన్ జడ్జి జువాన్ మర్చన్ స్పష్టంచేశారు. ఇలాంటి అనధికారిక విషయాల్లో ట్రంప్ కు రక్షణ ఉండొద్దని వ్యాఖ్యానించారు. హుష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా.. ఈ ఏడాది నవంబరులో న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు చేయాల్సిఉంది. ఇలాంటి సమయంలోనే ట్రంప్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా నమోదయ్యారు. దీంతో ఆయన క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్ కోర్టును ఆశ్రయించారు. దీనిపైనే విచారణ జరిపిన కోర్టు శిక్షను వాయిదా వేసింది. అయితే, ఈ కేసులో రక్షణ కల్పించే అవశాలు మాత్రం లేవని కోర్టు తేల్చి చెప్పింది.
అసలు కేసు ఏంటంటే?
ఒక వేళ ఈ కేసులో ఆయనకు ఊరట లభించకపోతే.. శిక్ష అభియోగాలను ఎదుర్కొంటూ శ్వేతసౌధంలోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ మారనున్నారు. కాగా.. పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్ తో ట్రంప్ తో సహజీవనంలో ఉన్నారని.. 2016 ఎన్నికల్లో ఆమె నోరువిప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన లాయర్ ద్వారా 1.30 లక్షల డాలర్ల హుష్ మనీని ఇప్పించారని ఆరోపణలు వచ్చాయి. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని, అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారనేది ట్రంప్ పై వచ్చిన ప్రధాన ఆరోపణ. కాగా.. ట్రంప్ పై వచ్చిన అభియోగాలనని కోర్టు తెలిపింది. ఆరు వారాల విచారణ తర్వాత ఆయన్న దోషిగా తేల్చింది. ఈ కేసులో మరోసారి న్యూయార్క్ కోర్టు ట్రంప్ నకు షాక్ ఇచ్చింది.