గవర్నర్ vs సీఎం సిద్ధరామయ్య.. కర్ణాటక కేబినెట్ సంచలన నిర్ణయం

కర్ణాటక రాజకీయం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ముడా’ స్కామ్‌లో స్వయంగా సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతించడం సంచలనంగా మారింది.

Update: 2024-08-17 14:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాజకీయం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ముడా’ స్కామ్‌లో స్వయంగా సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఆదివారం కర్ణాటక ప్రభుత్వం ఎమర్జెన్సీ కేబినెట్ సమావేశం నిర్వహించింది. ముడా కుంభకోణం వ్యవహారంలో సీఎంపై విచారణకు అనుమతించడంతో తదుపరి ఏం చర్యలు తీసుకోవాలి అనే దానిపై మంత్రివర్గం సమాలోచనలు చేసింది. ఈ వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యకు మంత్రిమండలి సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేబినెట్‌లో తీర్మానం చేశారు. కేబినెట్ అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ హైకమాండ్‌కు ధన్యవాదాలు చెప్పారు. కేబినెట్ సలహా మేరకు గవర్నర్ నడుచుకోవాలని అన్నారు. కర్ణాటక గవర్నర్ గెహ్లాట్ తీరు రాజ్యాంగ విరుద్ధంగాఉందని అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ చేతిలో గవర్నర్ కీలు బొమ్మలా మారారని అన్నారు.

Tags:    

Similar News