హిండెన్‌బర్గ్ ఆరోపణలపై స్పందించిన SEBI ఛీఫ్

శనివారం రాత్రి హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ సెబీ చైర్ పర్సన్ మాధబి పూరి బుచ్, ఆమె భరత్ ధవల్ బుచ్ పై సంచలన ఆరోపణలు చేసింది.

Update: 2024-08-11 02:19 GMT

దిశ, వెబ్ డెస్క్: శనివారం రాత్రి హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ సెబీ చైర్ పర్సన్ మాధబి పూరి బుచ్, ఆమె భరత్ ధవల్ బుచ్ పై సంచలన ఆరోపణలు చేసింది. వినోద్ అదానీకి అనుసంధానించబడిన ఆఫ్‌షోర్ సంస్థలలో భార్యభర్తలు షేర్లు కలిగి ఉన్నారని ఆరోపించింది. అదానీ గ్రూప్ ఆర్థిక దుష్ప్రవర్తనతో ముడిపడి ఉన్న ఆఫ్‌షోర్ సంస్థలలో దంపతులు వాటాలు కలిగి ఉన్నారని ఆరోపణలున్నాయని ప్రకటించడంతో ఒక్కసారిగా దేశంలో సంచలన రేగింది. మారిషస్ సహా పలుదేశాలలోని డొల్ల కంపెనీల నుంచి అదానీ గ్రూపునకు నిధుల పంపింగ్‌పై తాము గతంలోనే వెల్లడించినా, దానిపై సెబీ ఏమాత్రం విచారణ చేయలేదని హిండెన్‌బర్గ్ గుర్తుచేసింది. ఆ డొల్ల కంపెనీల్లో వాటాలు ఉండబట్టే వాటిపై విచారణకు సెబీ ఛైర్‌పర్సన్ మాధవీ పూరీ బుచ్ ఆదేశాలు జారీ చేయకపోయి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలపై SEBI చీఫ్ మాధబి పూరి బుచ్ స్పందిస్తూ.. 'మా ఆర్థిక విషయాలు తెరిచిన పుస్తకం' తమపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదంటూ.. హిండెన్‌బర్గ్ నివేదికను ఆమె ఖండించారు.


Similar News