Scientist Discoveries: సముద్రంలో వేల అడుగుల లోతున దొరికిన వింత వస్తువులు! శాస్త్రవేత్తలు కూడా షాక్

Scientist Discoveries: సముద్రం పలు రకాల వింత జీవులకు ఆవాసం.

Update: 2025-03-16 05:58 GMT
Scientist Discoveries: సముద్రంలో వేల అడుగుల లోతున దొరికిన వింత వస్తువులు! శాస్త్రవేత్తలు కూడా షాక్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: Scientist Discoveries: సముద్రం పలు రకాల వింత జీవులకు ఆవాసం. ఒక్కోసారి అవి సముద్ర తీరానికి కొట్టుకొస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఒక్కోసారి అవేంటో పరిశోధకులకు కూడా అంతుపట్టకుండా ఉంటాయి. కొన్ని వస్తువులు, పదార్థాలు కూడా తీరానికి కొట్టుకువచ్చినా అవేంటో కూడా గుర్తుపట్టలేనట్లు ఉంటాయి. అవి అలాగే మిస్టరీగా మిగిలిపోతుంటాయి. అయితే అలాంటి వింత వస్తువులు ఇప్పుడు శాస్త్రవేత్తలకు సవాల్ గా మారాయి.

మధ్యధర సముద్రంలోని అత్యంత లోతైన ప్రదేశమైన కాలిప్సో డీప్ లో ఓ వింత వస్తువులు అంతుపట్టని వ్యవహారంలా మారాయి. అసలు ఆ పదార్థాలు ఏంటనేది కూడా గుర్తించలేకపోయారు. మధ్యధరా సముద్రంలోని అత్యంత లోతైన ప్రదేశమైన కాలిప్సో డీప్ (5,112 మీటర్ల లోతు)లో 167 వస్తువులను కనుగొన్నారు. ఈ వస్తువులలో దాదాపు 88శాతం ప్లాస్టిక్‌తో తయారయ్యాయని చెబుతున్నారు. కానీ వాటి రూపాయలు చూస్తే అవేంటో కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నామని శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అయితే బార్సిలోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో ప్లాస్టిక్ సంచులు, ఇతర వస్తువులు సముద్రపు అడుగుభాగంలో పడి ఉన్నాయని కనుగొన్నారు. అసలు ఈ పదార్థాల మూలాలు ఏంటన్నది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీటి కారణంగా సముద్ర జీవులు మరణిస్తున్నాయి. అనేక జాతులు విలుప్త అంచుకు చేరుకున్నాయి. సముద్రంలో పెద్ద మొత్తంలో చెత్త పేరుకుపోవడం వల్ల.. అనేక ప్రాంతాలలో మృత మండలాలు ఏర్పడ్డాయి. దీని అర్థం జీవం ఉండే అవకాశం దాదాపుగా ముగిసిన ప్రాంతాలు.

పర్యావరణ పరిరక్షణ సంస్థ నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం 8 నుండి 12 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సముద్రంలోకి వెళ్తోంది. ప్రస్తుతం ప్రపంచ మహాసముద్రాల ఉపరితలంపై 15 నుండి 51 ట్రిలియన్ల ప్లాస్టిక్ ముక్కలు తేలుతున్నాయి. సముద్ర జీవులు ఈ ప్లాస్టిక్‌ను ఆహారంగా తింటున్నాయి. ఇది వాటి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపడమే కాకుండా సముద్ర పర్యావరణ వ్యవస్థ అసమతుల్యతకు కారణమవుతోంది. సముద్ర కాలుష్యాన్ని ఆపడానికి మానవులు ఇప్పటికీ నిర్దిష్ట చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో సముద్రం దాని జీవవైవిధ్యం ప్రమాదంలో పడవచ్చు.

Tags:    

Similar News