Supreme Court : విద్యాసంస్థల్లో బాలల భద్రతపై సెప్టెంబరు 24న ‘సుప్రీం’ విచారణ

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలోని బద్లాపూర్ సహా దేశంలోని పలుచోట్ల స్కూళ్లలో బాలికలపై లైంగిక దాడి ఘటనలను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుంది.

Update: 2024-08-28 16:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలోని బద్లాపూర్ సహా దేశంలోని పలుచోట్ల స్కూళ్లలో బాలికలపై లైంగిక దాడి ఘటనలను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుంది. విద్యాసంస్థల్లో బాలల భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలంటూ ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.

కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను కేవలం ఐదు రాష్ట్రాలే అమలు చేస్తున్నాయని సదరు ఎన్జీవో తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌పై సెప్టెంబరు 24న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, ఎన్‌‌.కె.సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.


Similar News