ఓటరు గోప్యత ఉల్లంఘణకు సంబంధించిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఈ పిటిషన్‌కు ఎలాంటి అర్హత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

Update: 2024-05-17 15:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుత ఎన్నికల్లో ఓటరు గోప్యత ఉల్లంఘించబడిందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను భారత అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌కు ఎలాంటి అర్హత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఈవీఎంలు ట్యాంపరింగ్ ఆరోపణలపై ఏప్రిల్ 26న సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్ చదవలేదని అభిప్రాయపడింది. పిటిషనర్ తరపు న్యాయవాది పోలింగ్ అధికారి వీవీప్యాట్ స్లిప్‌లు, ఈవీఎంలో నిల్వ ఉన్న డేటాను చూడగలరని వాదనలు వినిపించారు. 'ఏ ఓటరు ఏ పార్టీకి ఓటు వేశారో ప్రిసైడింగ్ అధికారి తెలుసుకునే అవకాశం లేదు. మీరు ఏప్రిల్ 26 నాటి తీర్పును పరిశీలించండి. తాజా పిటిషన్‌లో మాకు ఎలాంటి మెరిట్ కనిపించడంలేదంటూ ధర్మాసనం పేర్కొంది. 

Tags:    

Similar News