ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్.. తిహార్ జైలు బాత్రూమ్‌లో పడిపోయిన ఆప్ నేత

ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేందర్ జైన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.

Update: 2023-05-25 12:31 GMT

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేందర్ జైన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి తిహార్ జైలు బాత్రూమ్‌లో స్పృహ తప్పి పడిపోవడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. తొలుత దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించగా.. ఆరోగ్యం విషమించడంతో ఎల్ఎన్ జేపీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన ఐసీయూలో ఆక్సిజన్ సపోర్ట్ పై చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో గతేడాది జైలుకెళ్లిన జైన్ బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు పలుసార్లు తిరస్కరించింది.

కొంతకాలం క్రితం కూడా బాత్ రూమ్‌లో పడిపోవడంతో జైన్ వెన్నెముకకు తీవ్ర గాయమైందని, అప్పటి నుంచి ఏకంగా 35 కిలోల బరువు తగ్గి బలహీనంగా మారారని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేయాలని జైన్ పెట్టుకున్న పిటిషన్‌పై అత్యవసర విచారణ కోసం వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించింది. మనీలాండరింగ్ కేసులో జైన్ గతేడాది జైలుకెళ్లిన విషయం తెలిసిందే. జైన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీ అహంకారాన్ని, దౌర్జన్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

Tags:    

Similar News