Russia: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. ఇంధన వనరులే టార్గెట్

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. కీవ్, ఇతర నగరాల్లో ఆదివారం తెల్లవారుజామున దాడులకు పాల్పడింది.

Update: 2024-11-17 11:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌(Ukrein)పై రష్యా (Russia) మరోసారి విరుచుకుపడింది. కీవ్, ఇతర నగరాల్లో ఆదివారం తెల్లవారుజామున దాడులకు పాల్పడింది. శీతాకాలం ప్రారంభం కావడంతో విద్యుత్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలపై120 డ్రోన్లు (Drones), 90 క్షిపణుల(Missiles)ను ప్రయోగించినట్టు అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) వెల్లడించారు. ఈ దాడిలో కొంత మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలిపారు. ఆగస్టు తర్వాత రష్యా క్షిపణి దాడులు చేయడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ ఇంధన మంత్రి జర్మన్ గలుష్చెంకో మాట్లాడుతూ.. ‘విద్యుత్ వ్యవస్థపై మరో భారీ దాడి జరుగుతోంది. ఉక్రెయిన్ అంతటా విద్యుత్ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలపై శత్రువు దాడి చేస్తోంది’ అని తెలిపారు. రష్యా దాడుల నేపథ్యంలో కీవ్, దాని పరిసర ప్రాంతాలతో సహా అనేక నగరాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే నష్టం ఏమీ సంభవించనప్పటికీ ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. కాగా, రష్యా చివరిసారిగా ఆగస్టు 26న కీవ్‌పై భారీ క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Tags:    

Similar News