Russia : 2025 నుంచి వీసా లేకుండానే రష్యాకు

దిశ, నేషనల్ బ్యూరో : టూర్ కోసం, వ్యాపార అవసరాలపై విదేశాలకు వెళ్లే భారతీయులకు(Indians) గుడ్ న్యూస్.

Update: 2024-12-16 05:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో : టూర్ కోసం, వ్యాపార అవసరాలపై విదేశాలకు వెళ్లే భారతీయులకు(Indians) గుడ్ న్యూస్. వచ్చే సంవత్సరం (2025) మార్చి నుంచి భారతీయులు రష్యా(Russia)కు వీసా లేకుండానే వెళ్లొచ్చు. పరస్పర వీసా పరిమితులను సడలించే అంశానికి సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందంపై ఈ ఏడాది జూన్‌లో భారత్, రష్యాలు చర్చించినట్లు తెలిసింది. ఆ ఒప్పందంలోని ప్రతిపాదనల వల్లే భారతీయులు త్వరలో వీసా లేకుండా(visa free travel) రష్యాకు వెళ్లగలుగుతారు.

2023 ఆగస్టు నుంచి భారతీయులకు రష్యా ఈ-వీసాలు జారీ చేస్తోంది. వీటి ప్రాసెసింగ్‌కు నాలుగు రోజుల టైం పడుతుంది. ఇప్పటివరకు భారతీయులకు 9,500 ఈవీసాలను రష్యా జారీ చేసింది. తద్వారా రష్యా నుంచి ఈవీసాలు పొందిన టాప్-5 దేశాల జాబితాలో భారత్‌కు చోటు దక్కింది. 2023 సంవత్సరంలో 60వేల మందికిపైగా భారతీయులు రష్యాకు వెళ్లారు. 2022తో పోలిస్తే ఇది 26 శాతం ఎక్కువ. 2024 సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి జులై 1 మధ్యకాలంలో దాదాపు 1,700 ఈ-వీసాలను భారతీయులకు రష్యా ఇచ్చింది. ప్రస్తుతానికి భారతీయులు 62 దేశాలకు వీసా లేకుండా వెళ్లగలుగుతున్నారు.

Tags:    

Similar News