ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. మిస్సైళ్ల దాడి..
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రతరం చేసింది. సుమారు 80కి పైగా క్షిపణులతో విరుచుకపడింది.
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రతరం చేసింది. సుమారు 80కి పైగా క్షిపణులతో విరుచుకపడింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉక్రెయిన్‌లోని 10 ప్రాంతాల్లో పౌర నివాసాలపై దాడులు చేసినట్లు అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. ఈ దాడుల్లో కనీసం ఆరుగురు పౌరులు మరణించినట్లు చెప్పారు. గత మూడు వారాల్లో రష్యా చేసిన అతి పెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.
దాడుల కారణంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు వెళ్లే విద్యుత్ నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. గత ఐదారు నెలలుగా పౌర నివాసలు, శక్తి వనరులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఆక్రమణదారులు కేవలం పౌరుల భయపెట్టడం మాత్రమే చేయగలరని జెలెన్‌స్కీ ప్రకటనలో తెలిపారు. అప్రమత్తమైన అధికారులు వీధుల్లోకి సైరన్లను మోగించారు. ప్రజలు బంకర్లలో తలదాచుకోవాలని కోరారు.